Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో మోడీకి ఏపీ ప్రజలు గుండు కొడతారు : వేణుమాధవ్

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండు కొడతారంటూ సినీ నటుడు వేణుమాధవ్ జోస్యం చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర నుంచి

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (09:57 IST)
వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండు కొడతారంటూ సినీ నటుడు వేణుమాధవ్ జోస్యం చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పిన కేంద్రానికి బుద్ధి చెప్పేందుకే సైకిల్‌యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.
 
భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి తీరనిద్రోహం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాటమార్చారని ఆరోపించారు. నాలుగేళ్లు విశ్వాసంగా ఉన్నా ఫలితం లేకపోవడంతో పోరాటం తప్పలేదని చెప్పారు. కేంద్రం చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలంలో ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ మళ్లీ గెలిస్తే అరగుండు గీయించుకొంటానని ఓ వైకాపా నాయకుడు అన్నాడని, తమ నాయకులు చందాలు వేసుకొని ఖర్చులకు ఇస్తారని తిరుపతికి వెళ్లి పూర్తి గుండు తీయించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రప్రజల ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్నారని, తెలుగుజాతి అండగా నిలవాలని ఈ సందర్భంగా వేణుమాధవ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments