Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ ఫ్యాన్స్‌కు నేను తెలియజేస్తున్నదేమిటంటే?: వేణు మాధవ్

పవన్ ఫ్యాన్సుకు.. సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా.. హాస్యనటుడు వేణుమాధవ్ మాట్లాడారు. పనిలో పనిగా కత్తి మహేష్‌పై వంగ్యాస్త్రాలు సంధించారు. ఓ టీవీ లైవ్ ప్రోగ్రా

Advertiesment
Venu Madhav
, ఆదివారం, 7 జనవరి 2018 (14:42 IST)
పవన్ ఫ్యాన్సుకు.. సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా.. హాస్యనటుడు వేణుమాధవ్ మాట్లాడారు. పనిలో పనిగా కత్తి మహేష్‌పై వంగ్యాస్త్రాలు సంధించారు. ఓ టీవీ లైవ్ ప్రోగ్రామ్‌లో కత్తి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ లైన్ ద్వారా వేణు మాధవ్ మాట్లాడుతూ.. యాంకర్ సత్యతో తనకు పరిచయం కనుక.. ఆమెతో మాట్లాడుతాను. 
 
పరిచయం లేని వాళ్లతో తాను మాట్లాడనని చెప్పేశారు. మీ ద్వారా పవన్ అభిమాని కిరణ్ రాయల్‌కు, పవన్ అభిమానులందరికీ, జనసేన ఫ్యాన్స్‌కి తెలియజేస్తున్నదేమిటంటే..దయచేసి, ఎవరూ లైవ్‌లో మాట్లాడకండి. ఆడవాళ్ల మీద, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపైనా మాట్లాడితే, వారిపై చర్యలు తీసుకోక తప్పదని సూచించారు.
 
తాను ఎవరినీ విమర్శించనని.. పెద్దవాళ్ళు... అంకుల్స్ (కత్తి మహేష్)తో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడనని వేణుమాధవ్ వెల్లడించారు. వాళ్లను గౌరవించే అలవాటు తనకుందన్నారు. ఆ అంకుల్‌ని గౌరవించాల్సిన బాధ్యత తనకుందని.. తన ఉద్దేశంలో ఆ అంకుల్ (కత్తి మహేష్) ఆరోగ్యం పాడై వుంటుందని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ రేణూ దేశాయ్‌నే పట్టించుకోలేదు.. ప్రజల్ని ఎలా?: కత్తి మహేష్