Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూనమ్ కౌర్ పవన్‌కు నాలుగో భార్యగా వుంటానంది: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో కత్తి మహేష్ పవన్‌పై రాస్తున్న కామెంట్లు వివాదానికి దారితీస్తున్నాయి. ఇప

Advertiesment
పూనమ్ కౌర్ పవన్‌కు నాలుగో భార్యగా వుంటానంది: కత్తి మహేష్
, శనివారం, 6 జనవరి 2018 (10:59 IST)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో కత్తి మహేష్ పవన్‌పై రాస్తున్న కామెంట్లు వివాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్ ఫ్యాన్స్‌- కత్తి మహేష్ మధ్య వార్ జరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి.. కత్తి నోటిలో నానింది.  
 
ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వారి కంటే అడుక్కునే వారే ఎంతో ఉత్తములని ట్విట్టర్లో పూనమ్ వ్యాఖ్యానించింది. "ఆ ఫ్యాట్సోను (కత్తి మహేష్)ను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం, నిరుద్యోగ స‌మ‌స్య, ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. ఆయ‌న‌కు డ‌బ్బులు డొనేట్ చేయండి. మ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మ‌నం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విష‌యం. అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌హేశ్ క‌త్తిని ఉద్దేశిస్తూ ఆమె వ‌రుస‌గా ట్వీట్లు చేసింది.
 
ఈ క్రమంలో సదరు హీరోయిన్‌పై కత్తి మహేష్ అదే స్థాయిలో కౌంటరిచ్చాడు. సదరు హీరోయిన్ తనను ఫ్యాట్సో అంటూ మాట్లాడిందని.. ఆమె మాటల్లోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతుందని విమర్శించాడు. పవన్ చేసిన సాయంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆమె ఎంపికైంద‌ని, పవన్ మెప్పు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. 
 
అంతటితో ఆగకుండా.. 'ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి నాలుగో భార్య అవ్వ‌డానికి రెడీ అని హీరోయిన్‌ పూనం కౌర్ అన్నారు. ఆమె రెండు మూడు ఇంట‌ర్వ్యూల్లో ఈ విష‌యాన్ని తెలిపింది. కావాలంటే యూ ట్యూబ్‌లో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌ను చూసుకోండి' అని కత్తి మహేష్ విమర్శలు గుప్పించాడు. 
 
ఇంతలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. వ్యక్తిత్వంలో ''నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు'' అంటూ ట్వీట్ చేశారు. పవన్ చేసిన ట్వీట్‌కు కత్తి మహేష్ అదే స్థాయిలో స్పందించాడు. "ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్... నేను కాదు'' అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. కాబట్టి పెట్టే గడ్డి ఏదో వాళ్లకే పెట్టాలంటూ సూచించారు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే దాని గురించి నీవు మాట్లాడకపోతేనే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ చేసి బుక్ చేసుకోమంటున్న నటి స్వాతి నాయుడు (వీడియో)