Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తీర్థం పుచ్చుకున్న అలీ.. పోటీ చేయట్లేదు.. ప్రచారం చేస్తా..!

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (10:25 IST)
ప్రముఖ హాస్యనటుడు అలీ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ ఆ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. 
 
గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు. కానీ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్‌పాండ్‌వైపు మళ్లినట్టు భావిస్తున్నారు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలీ వెంట సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.
 
వైకాపా తీర్థం పుచ్చుకున్నాక అలీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా వైకాపాకు ప్రచారం చేస్తానని.. పోటీ సంగతిని ప్రస్తుతానికి పక్కనబెట్టానని అలీ చెప్పారు. స్థానికులకు సీటు ఇవ్వకుండా అలీకి ఇస్తే.. ఇబ్బందులు ఏర్పడుతాయని జగన్ చెప్పారని.. ఆయన చెప్పినట్లు ప్రచారానికి పరిమితం అవుతానని అలీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments