Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచిన్ - సెహ్వాగ్ రికార్డును బద్ధలుకొట్టిన శర్మ - ధవాన్

Advertiesment
సచిన్ - సెహ్వాగ్ రికార్డును బద్ధలుకొట్టిన శర్మ - ధవాన్
, ఆదివారం, 10 మార్చి 2019 (16:20 IST)
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌లు సరికొత్త రికార్డును నెలకొల్పారు. కొన్ని రోజులుగా పెద్ద భాగస్వామ్యాలు ఏవీ నెలకొల్పని ఈ జోడీ.. నాలుగో వన్డేలో సెంచరీ భాగస్వామ్యాలను అందుకుంది. రోహిత్, ధావన్‌లకు ఇది 15వ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం. అంతేకాదు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఈ జోడీ వెయ్యి పరుగులు చేసింది. 
 
ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ రికార్డును కూడా రోహిత్, ధావన్ జోడి అధికమించారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకు 4,387 పరుగులు చేశారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికీ సచిన్, గంగూలీ జోడీయే టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ జోడీ 176 ఇన్నింగ్స్‌లో 8,227 పరుగులు చేసింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తం 92 బంతులను ఎదుర్కొన్న రోహిత్ రెండు సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 103.26 స్ట్రైక్‌తో 95 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవాన్ మాత్రం సెంచరీతో వీరవిహారం చేశాడు. 
 
ధావన్ 115 బంతులను ఎదుర్కొన్న ధవాన్... 3 సిక్స్‌లతో, 18 ఫోర్ల సాయంతో 124.34 స్ట్రైక్‌ రేటుతో 143 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 193 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొహాలీ వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్