Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ రూ.150 కోట్ల స్కామ్‌.. ఆధారాలతోనే అచ్చెన్న అరెస్టు : ఏసీబీ

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (11:44 IST)
ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడంలో రూ.150 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉన్నట్టు ఏసీబీ జాయింట్ డెరెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని శుక్రవారం వేకువజామున ఏసీబీ అరెస్టు చేసింది. 
 
దీనిపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. 
 
కాగా, ఈఎస్‌ఐ స్కామ్‌లో సుమారు 150 కోట్లు అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్ధారణ జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణ జరిగినట్లు తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారన్నారు. 
 
అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేశారన్నారు. విజిలెన్స్ రిపోర్ట్‌పై ప్రభుత్వ అదేశాలుపై ఏసీబీ కేసు విచారణ చేస్తూ అరెస్టు చేసినట్లుగా ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments