Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త బతికుండగానే 15 యేళ్ళుగా వితంతు పెన్షన్ తీసుకున్న భార్య, ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:17 IST)
వారికి పెళ్ళయి రెండు సంవత్సరాలైంది. ఇద్దరి మధ్యా పొసగలేదు. విడాకులకు ధరఖాస్తు చేసుకుని విడిపోయారు. ఇదంతా 15 యేళ్ళ క్రితం జరిగింది. ఇద్దరూ వేర్వేరు పెళ్ళిళ్లు చేసేసుకున్నారు. కానీ తన భర్త చనిపోయాడంటూ రెవిన్యూ అధికారులను మోసం చేసి వితంతు పెన్షన్ పొందుతోంది భార్య. 
 
శ్రీకాకుళం జిల్లా కోటప్ప మండలం కొత్తకోటకు చెందిన రూప, శ్రీనులకు 17 యేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరూ మొదట్లో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో శ్రీనుతో విభేధించింది రూప. ఇద్దరూ కలిసే విడాకులకు అప్లై చేసుకున్నారు. విడిపోయారు. ఆ తరువాత కొన్నినెలల గ్యాప్‌లో వారు వేరే వివాహం చేసేసుకున్నారు.
 
ఇదంతా బాగానే ఉన్నా రూప మాత్రం తన భర్త చనిపోయాడంటూ రెవిన్యూ కార్యాలయంలో ధరఖాస్తు  చేసుకుని ఫించన్ తీసుకోవడం ప్రారంభించింది. 2014 సంవత్సరంలో ఆన్ లైన్ చేశారు. అప్పుడు కూడా ధరఖాస్తు చేసుకుని వితంతు పెన్షన్ తీసుకోవడం కొనసాగిస్తోంది. ఇది కాస్త భర్తకు తెలిసింది.
 
నిన్న ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళి అధికారులో గొడవపెట్టుకున్నాడు శ్రీను. తాను బతికే ఉన్నానని.. అయితే తాను  చనిపోయానంటూ మొదటి భార్య ధరఖాస్తు చేస్తే ఎలా ఇన్ని సంవత్సరాలుగా వితంతు పెన్షన్ ఇస్తున్నారంటూ ప్రశ్నించాడు. రెవిన్యూ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయాడు శ్రీను. దీనిపై ఎమ్మార్వో అధికారులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments