Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే షెల్టర్ హోంలో మాజీ మహిళా ఎస్ఐపై అత్యాచారం.. ఎక్కడ?

రైల్వే షెల్టర్ హోంలో మాజీ మహిళా ఎస్ఐపై అత్యాచారం.. ఎక్కడ?
, బుధవారం, 6 మే 2020 (17:00 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రైల్వే షెల్టర్ హోంలో ఉంటున్న ఓ మాజీ మహిళా ఎస్ఐ ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు కామాంధులు లైంగికదాడికి తెగబడ్డారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిరోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ 50 యేళ్ల మహిళకు కారుణ్య నియామకం కింద ఎస్ఐ ఉద్యోగం ఇచ్చాడు. ఈమె భర్త రైల్వే శాఖలో పని చేస్తూ మృతి చెందడంతో ఈమెకు ఉద్యోగం లభించింది. కొంతకాలం పని చేసిన తర్వాత ఆమె ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చింది. 
 
ఈ క్రమంలో లాక్‌డౌన్‌కు ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీ వైష్ణోదేవిమాత ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం ముగించుకుని తిరుగుపయనమైంది. సరిగ్గా ఆ సమయంలోనే దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ మహిళ మార్గమధ్యంలో చిక్కుకునిపోయారు.
 
ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆమెనుషెల్టర్ హోంలో ఉంచారు. గత నెలన్నర రోజులుగా అక్కడే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివుడు కోరాడనీ పురుషాంగాన్ని త్యాగం చేసిన ఖైదీ... ఎక్కడ?