Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్ ఎఫెక్టు :: ఊరిలో మొగుడు .. ఇంట్లో ప్రియుడు.. ఎక్కడ?

Advertiesment
లాక్‌డౌన్ ఎఫెక్టు :: ఊరిలో మొగుడు .. ఇంట్లో ప్రియుడు.. ఎక్కడ?
, సోమవారం, 4 మే 2020 (18:23 IST)
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం దశలవారీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వచ్చిన వివాహేతర సంబంధాలు బట్టబయలవుతున్నాయి. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువ వ్యాపారి తన స్నేహితుడుతో కట్టుకున్న భార్య రహస్యంగా కొనసాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధం గుట్టును రట్టు చేశాడు. ఇంతకీ ఈ వ్యాపారికి ఇటీవలే వివాహం కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
పంకజ్ అనే యువ వ్యాపారికి రింకీ అనే మహిళతో ఇటీవలే వివాహమైంది. తన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా పంకజ్ పలు రాష్ట్రాలకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో పంకజ్ చండీగఢ్‌లో ఉన్న సమయంలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో పంకజ్ అక్కడే చిక్కుకునిపోయాడు. 
 
ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తన భార్యకు చేదోడువాదోడుగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలని తన చిన్ననాటి స్నేహితుడు రాకేష్‌ను పంకజ్ కోరాడు. ఇదే ఆ యువ వ్యాపారి చేసిన తప్పు. 
 
పంకజ్ కోరిక మేరకు రింకీ ఇంటికి వచ్చిన రాకేష్.. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆమెతో మంచి చనువు ఏర్పడింది. అది చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయాన్ని తన ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా పంకజ్ కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నిర్మూలనకు జగన్ సర్కారు కట్టుబడిలేదు : పవన్ కళ్యాణ్