Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ-కామర్స్ సంస్థలకు ఊరట.. కానీ అమేజాన్‌కు తప్పని నష్టాలు

ఈ-కామర్స్ సంస్థలకు ఊరట.. కానీ అమేజాన్‌కు తప్పని నష్టాలు
, శనివారం, 2 మే 2020 (17:16 IST)
దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. 
 
తాజాగా మూడో దశ లాక్ డౌన్‌కు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే ప్రజలకు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేయవచ్చు.  
 
ఇకపోతే.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమేజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక గొడుగు ఎంత పనిచేసింది.. యానిమేటెడ్ పోస్టు వైరల్