Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్కీ మొగుడికి డాక్టర్ భార్య.. గర్భిణి అనే కనికరం లేకుండా ఆ పని చేశాడు..

టెక్కీ మొగుడికి డాక్టర్ భార్య.. గర్భిణి అనే కనికరం లేకుండా ఆ పని చేశాడు..
, శుక్రవారం, 1 మే 2020 (18:57 IST)
కరోనా వైరస్ నుంచి రోగులను కాపాడేందుకు వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. అలాంటి వైద్యులకు ప్రజలే అగౌరవపరిచే ఘటనలు జరిగివున్నాయి. వారి శవాలను ఖననం చేసేందుకు కూడా శ్మశానంలో చోటు ఇవ్వని ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ వైద్యురాలి పట్ల బయటి వ్యక్తులు కాదు కట్టుకున్న భర్తే అమానుషంగా ప్రవర్తించాడు. 
 
గర్భిణీ అయిన ఓ వైద్యురాలు కరోనా వైరస్ రోగులను కాపాడటంలో భాగంగా ఆసుపత్రిలోనే ఎక్కువ సమయం గడిపింది. అయితే వైద్యురాలి భర్త టెక్కీ మాత్రం ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళా వైద్యురాలి భర్త సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ టెక్కీకి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో ఇంట్లో ఉంటున్నాడు.
 
అయితే కరోనా బాధితులకు చికిత్స అందించడంలో భార్య బిజీగా వుండటంతో ఆమె తీరుపై సహనం కోల్పోయిన టెక్కీ ఆమె గర్భవతి అనికూడా చూడకుండా అర్థరాత్రి మెడపట్టి బయటకు గెంటేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏం జరిగింది అంటూ ఆరా తీస్తే భర్త చేస్తున్న ఆరోపణలు విని షాక్‌ తిన్నారు. టెక్కీ భర్త, డాక్టర్ భార్య బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం టెక్కీ వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు. 
 
భార్య డాక్టర్ కావడంతో, ఆసుపత్రిలో కరోనా రోగులతో పాటు వేరే రోగులకు చికిత్స చేసేందుకు ఆమె ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్నారు. ఆ వైద్యురాలు ఐదు నెలల గర్భిణి. ఇక భార్య తనను పట్టించుకోకుండా రోగులకు వైద్యం చేయడంలోనే ఎక్కువ సమయం గడుపుతుందని భావించిన టెక్కీ భర్త గురువారం రాత్రి ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటికి వచ్చిన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అర్థరాత్రి గర్భిణి భార్య అని కనికరం లేకుండా ఆమెను మెడపట్టుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.
 
అర్థరాత్రి భర్త ఇంటి నుంచి బయటకు గెంటేయడం, లాక్ డౌన్ సందర్భంగా పుట్టింటితో పాటు ఎక్కడికి, ఎవ్వరి దగ్గరకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో గర్భిణి అయిన భార్య బెంగళూరు పోలీసు కమిషనర్ కార్యాలయంలోని వనిత సహాయవాణికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు జయనగర్‌లోని ఇంటికి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని టెక్కీ భర్తను ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ కు గురైనారు.
 
నెల రోజుల నుంచి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటున్నానని, తన భార్య ప్రతిరోజు ఆస్పత్రికి వెళ్లిపోతోందని.. ఇంటిని శుభ్రం చేయట్లేదని.. వంట కూడా సక్రమంగా చేయట్లేదని భర్త ఆరోపించాడు. అయితే గర్భిణి అని కనికరం లేకుండా అర్దరాత్రి భార్యను బయటకు గెంటేసిన భర్తకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించి వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌‍డౌన్- పంజాబ్‌లో భర్త, భార్య గదిలో ప్రియుడు.. బెడ్ కింద దాచేసి?