Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో వైద్యశాఖలో 9,700 ఖాళీల భర్తీ: మంత్రి ఆళ్ల నాని

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (21:35 IST)
వైద్యశాఖలో 9,700 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, రిమ్స్‌ వైద్య కళాశాలను గురువారం పరిశీలించారు.

అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రిమ్స్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

సర్వజన ఆస్పత్రి, రిమ్స్‌లో సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ నివాస్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యేలు పాల్గన్నారు.

విజయనగరంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి‌తో కలిసి స్థల పరిశీలన చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments