Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా బాధితులను గుర్తించడం ఎలా?.. ఏపీ వైద్యశాఖ మార్గదర్శకాలు

కరోనా బాధితులను గుర్తించడం ఎలా?.. ఏపీ వైద్యశాఖ మార్గదర్శకాలు
, గురువారం, 21 మే 2020 (07:42 IST)
కరోనా బాధితులను గుర్తించడంపై ఏపీ వైద్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు కోవిడ్-19 ఏపీ స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధావిధిగా...

మామూలు చికిత్స అందించే ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వ్యక్తులలో  పైకి ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనపడినప్పటికీ వారి అనారోగ్య లక్షణాలు  పరిశీలనలో భాగంగా వారికి నిర్వహించే పరీక్షలలో ఒక్కోసారి  కోవిడ్19 కి అనుకూల ఫలితాలు రావడంతో అప్పటికే ఆ కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యక్తులు భయబ్రాంతులకు గురి అవడంతో పాటు ఆ కేంద్రంలో పని చేసే సిబ్బందిలో భయాందోళనలు కలుగ చేస్తాయి.
 
ఇలాంటి వ్యక్తులవలన ఒకొక్క సారి ఆరోగ్య కార్యకర్తలు సైతం కోవిడ్19 ప్రభావానికి గురై అక్కడ చికిత్సా కేంద్రాన్ని మూసి వేసే పరిస్థితులు ఏర్పడడము లేక ఆ ఆరోగ్య కేంద్రం పని తీరు బలహీనపడడము లాంటి సంఘటనలు జరగడం మనం చూడవచ్చు.

ఆరోగ్య కేంద్రాల లో ఉండి చికిత్స పొందే రోగులు చికిత్స కేంద్రాల ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రభావానికి లోనుకాకుండా  ఉండటానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకత్వం జారీ చేసినప్పటికీ ఇన్ఫెక్షన్ల సోకకుండా సరైన  జాగ్రత్తలు పాటించడం మన ఆరోగ్య కేంద్రాలలో  చాలా వరకు సాధ్యపడక పోవచ్చు.
 
ఒక్కోసారి తేలికపాటి లేదా  అసలు లక్షణాలు కనపడని  కోవిడ్-19 ప్రభావిత వ్యక్తులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రాలను దర్శించినపుడు  అనుకోకుండా ఇతర రోగులకు మరియు ఆరోగ్య కార్యకర్తలకు వీరి ద్వారా సంక్రమించే ప్రమాదం  ఏర్పడుతుంది మరియు ఇలాంటి  చర్య వలన  ఆరోగ్య కేంద్రం యొక్క కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదం ఏర్పడుతుంది.
 
కోవిడ్19 అనుమానిత లేదా పాజిటివ్ వ్యక్తుల చికిత్సకు ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ మరియు  ప్రైవేటు కోవిడ్19 చికిత్సా కేంద్రాలు. & కోవిడ్ చికిత్సకు లేదా కోవిడ్ కు సంబంధం లేని ఆసుపత్రులు, వాటి సంస్థాగత ఏర్పాట్లు..
 
దీనికోసం పకడ్బందీగా విధీ విధానాలతో హాస్పిటల్ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కమిటీ (హెచ్ఐసీసీ) అనే విభాగము ఏర్పాటు  చేయడం జరిగింది. చికిత్స అందించే ఆరోగ్య సిబ్బందిలో కోవిడ్-19 బారిన పడిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత యంత్రాంగానికి తెలియచేయడానికి  ఈ విభాగం  బాధ్యత వహిస్తుంది. 
 
ఆరోగ్య సిబ్బంది యొక్క విధుల ప్రారంభం మరియు ముగించుకునే సమయం లో జ్వరం / దగ్గు / శ్వాస తీసుకోవడం లో  ఇబ్బంది పడే వ్యక్తుల కోసం చురుకైన పరిశీలన నిర్వహించేలా ఈ విభాగం చూస్తుంది. అంతే కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో ఆరోగ్య కేంద్రం లో చేరి చికిత్స పొందుతున్న వ్యక్తులలో కారణం లేకుండా జ్వరం గాని దగ్గు తో గాని శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడే వ్యక్తులను సైతం  ఈ విభాగం పర్యవేక్షణలో ఉంచుతుంది. 
 
అధిక ప్రమాద పరిస్థితులకు అనుగుణంగా ఐపీసీ ద్వారా ప్రస్తుతం ఉన్న  మార్గదర్శకాలను తప్పనిసరిగా సమీక్షించి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది అందరికీ అమలుపర్చాలి. మరియు ఈ ఐపిసి మార్గదర్శకాలు అన్ని సమయాలలో కట్టుబడి ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది.

ఒకవేళ ఏదైనా ఆరోగ్య కేంద్రం  కోవిడ్-19 కంటై నేషన్ జోన్ లకు సమీపంలో ఉన్నట్లయితే ఆ ఆరోగ్య కేంద్రాన్ని దర్శించే రోగులందరినీ కోవిడ్19 అనుమానితులుగా భావించి చికిత్స అందించి ఫలితాలలో ఒకవేళ కోవిడ్ నిర్ధారణ కాకపోతే మామూలు చికిత్స అందించాలి.
 
ఆరోగ్య కేంద్రం లో ఎపుడైనా మామూలు రోగి లేదా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో  కోవిడ్-19 కు సంబంధించిన అనుకూల లక్షణాలు లేదా  పరీక్షలు వలన  కోవిడ్ ఉన్నట్లు అనుమానించినప్పుడు, హెచ్ఐసీసీ విభాగం తగిన చర్య తీసుకుని ఎలా ప్రభావానికి గురయ్యారు అనే   విషయంపై దర్యాప్తు చేయడమే కాకుండా  మరియు తదుపరి చర్యలను తీసుకుంటుంది.
 
కోవిడ్ చికిత్స మరియు ఐసోలేషన్  సదుపాయం లేని  సామాన్య ఆరోగ్య కేంద్రం లో ఒకవేళ కోవిడ్19 ప్రభావిత వ్యక్తిని గుర్తించినపుడు ఈ కింది చర్యలు చేపట్టాలి... 
 
ఆ వ్యక్తి గురించి స్టానిక ఆరోగ్య అధికారులకు తెలియచేయాలి. కోవిడ్ చికిత్స కేంద్రానికి తరలించే ముందు అతని క్లినికల్ పరిస్థితిని అంచనా వెయ్యా లి. రోగి ప్రస్తుతం అందరితోపాటు చికిత్స పొందుతుంటుంటే అతనిని సరైన రక్షనా చర్యలు తీసుకోబడిన వ్యక్తి సహాయంతో  తక్షణం ఎవరూ లేని వేరొక గదిలోకి మార్చి అతనికి ముసుగు తొడిగి తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. 
 
పాజిటివ్ వ్యక్తి  యొక్క క్లినికల్ స్థితి అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తిని కోవిడ్-19 ఐసోలేషన్ సదుపాయం గల కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ చికిత్స అందించే  హాస్పిటల్ కి  బదిలీ చేయాలి. 

బదిలీ గురించి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయుటకు గాని సంబంధిత కేంద్రానికి ముందే తెలియచేయడమే కాకుండా అందుబాటులో ఉన్న ఆ వ్యక్తి యొక్క  క్లినికల్ స్థితి, పరీక్ష ఫలితాలు వంటి పూర్తి కేసు రికార్డులను  స్వీకరించే ఆసుపత్రికే కాకుండా అటువంటి రోగుల సమాచారం స్థానిక ఆరోగ్య అధికారానికి సైతం అందుబాటులో ఉంచాలి.
 
రోగిని స్టానిక కోవిడ్ చికిత్సా కేంద్రానికి  రవాణా చేసేటప్పుడు నిర్దేశించిన విధంగా  ప్రామాణిక జాగ్రత్తలు పాటించాలి.చికిత్స సౌకర్యం వద్ద మరియు రోగిని తరలించే అంబులెన్స్ ని శానిటైజ్ చేయుటకు నిర్దేశించిన ప్రామాణిక  క్రిమిసంహారక విధానాలను అనుసరించాలి.

ఈ రోగి యొక్క అన్ని పరిచయాలు అనగా ఒకే గదిలో లేదా వార్డులో ఇతనితో పాటు చికిత్స పొందిన  ఇతర రోగులు, ఆ రోగి కి  చికిత్స అందించిన వైద్య సిబ్బంది, రోగి చికిత్స కు  హాజరైన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక సిబ్బంది, రోగి యొక్క సంరక్షకుడు మరియు రోగిని సందర్శించిన  సందర్శకులు మొదలైనవారిని అనుసరించి  కనుగొని 14 రోజులపాటు  నిర్బంధించడమే కాకుండా  వారి వివరాలను స్థానిక ఆరోగ్య అధికారులతో కూడా పంచుకోవాలి.
 
ధృవీకరించబడిన కేసు యొక్క అన్ని దగ్గరి పరిచయాలు అయిన ఆరోగ్య సిబ్బంది  మరియు సహాయక సిబ్బంది ని హెచ్‌సిక్యూ(హెచ్ సీక్యూ) యొక్క వ్యతిరేకతలను దృష్టిలో ఉంచుకుని హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు  కెమోప్రొఫిలాక్సిస్‌పై 7 వారాల పాటు ఉంచాలి, ఒకవేళ ఏదైనా  ఆరోగ్య కార్యకర్త కు ఈ వ్యాధిని సంక్రమించినట్లు  అనుమానించి నట్లయితే, ఈ క్రింది అదనపు చర్యలను చేపట్టవలసి  ఉంటుంది. 
 
చికిత్స అందించిన ఆరోగ్య సిబ్బంది(హెచ్ సీడబ్ల్యూ) కోవిడ్-19 అనుమానితుడు లేదా  ధృవీకరించబడిన వ్యక్తి గా  గుర్తించబడినప్పుడు దగ్గు, జ్వరం శ్వాస తీసుకునే సందర్భంలో ఇబ్బంది పడడం వంటి లక్షణాలు గమనించిన ఆరోగ్య సిబ్బందిని కోవిడ్19 అనుమానిత కేసుగా భావించాలి.
 
అతను / ఆమె కు  వెంటనే ఫేస్ మాస్క్ తొడిగి , అతని పర్యవేక్షకుడికి మరియు హెచ్ఐసిసికి తెలియజేయాలి. అతడు / ఆమెను ఇతర సిబ్బందితో  వేరుచేయబడాలి మరియు అతను / ఆమె ను  తదుపరి నిర్వహణ కోసం సూచించబడిన కోవిడ్-19 ఆసుపత్రికి తరలించడానికి వెంటనే ఏర్పాట్లు చేయాలి.
 
అలాంటి సదుపాయాలు వెంటనే అందుబాటులో లేకపోతే  అతను / ఆమెను  తదుపరి చర్య తీసుకునే వరకూ ఐసోలెట్ గా ఉంచాలి. అతడు / ఆమెను విధుల  జాబితా వెంటనే నుండి తొలగించాలి. వ్యాధి అనుమానాస్పద లక్షణాలు  గుర్తించబడిన ఆరోగ్య కార్యకర్త ద్వారా  ప్రభావానికి గురైన   ఇతర ఆరోగ్య కార్యకర్తలను  మరియు ఇతర రోగులను వేగంగా గుర్తించి , వారిని నిర్బంధంలో ఉంచి 14 రోజులు పాటు అనుమానిత కేసు పరీక్ష ఫలితం ప్రతికూలంగా మారే వరకూ  గమనించాలి. మరియు వారి వివరాలను స్థానిక ఆరోగ్య అధికారులతో కూడా తెలియచేయాలి. 

ధృవీకరించబడిన కేసు యొక్క అన్ని దగ్గరి పరిచయాలు అయిన ఆరోగ్య సిబ్బంది  మరియు సహాయక సిబ్బందిని హెచ్‌సిక్యూ(హెచ్ సీక్యూ) యొక్క వ్యతిరేకతలను దృష్టిలో ఉంచుకుని హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు  కెమోప్రొఫిలాక్సిస్‌పై 7 వారాల పాటు ఉంచాలి. అన్ని ఆరోగ్య సదుపాయాల కార్యకలాపాలను నిర్వహించడానికి తప్పనిసరిగా సరైన  ప్రణాళికతో సహా సిబ్బంది సిద్దంగా ఉండాలి. ఉదా: ప్రతి 14 రోజుల విధుల  ప్రాతిపదికన పనిచేయడానికి హెచ్ సీఎఫ్ లోని సిబ్బందిని సమూహాలుగా విభజించవచ్చు. 
 
ఒకవేళ ఇందులో ఎవరైనా ఆరోగ్య సిబ్బంది  కోవిడ్-19 సంక్రమణంతో అనుమానాస్పదంగా గుర్తించబడి కనుగొనబడితే వారి స్థానంలో  ఎల్లవేళలా అందుబాటులో ఉంచబడిన అదనపు సిబ్బంది ద్వారా కార్యక్రమము నిరాటంకంగా సాగేలా చూడడం. క్రిమిసంహారక విధానాలను అనుమతించిన భద్రతా ప్రమాణాలను అనుసరించి  ఖచ్చితంగా పాటించేలా చూసుకోవడం.

ఒకవేళ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో అనుమానితుడు లేదా  ధృవీకరించబడిన కేసు కనుగొనబడితే వెంటనే ఐసోలేషన్ కి తరలించడం, సంప్రదింపు జాబితా ను తయారు చేయడం మరియు క్రిమి సంహారకం చేయడం వంటి  ప్రామాణిక విధానాలు పద్దతులు పాటించడం ద్వారా మొత్తం ఆరోగ్య కేంద్రాన్ని  మూసి వేయాల్సిన అవసరం లేకుండా చేయడం.
 
సాధారణ ఆరోగ్య కేంద్రాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్19 కేసులు గుర్తించిన సందర్భంలో..
సామాజిక-జనాభా కారణాలు హాస్పిటల్ యొక్క పరీవాహక ప్రాంతంలో కోవిడ్-19 యొక్క పెద్ద సమూహం కలిగి ఉండడం. క్యాచ్‌ మెంట్ ఏరియాలో పెద్ద సంఖ్యలో నివసించే హాని కలిగించే వ్యక్తులు, వివిధ అనారోగ్యాలతో బాధపడే , సరైన పోషకాహారం లభించని మరియు సామాజిక దూరాన్ని పాటించ లేకపోతున్న  వ్యక్తులు. ఉదా: అధిక జనాభాను కలిగి ఉండే మురికివాడ సమూహాలు.ఆరోగ్య సౌకర్యాలు కల్పన ఐపిసి పద్ధతుల స్థాయికి చేరుకోలేక పోవడం. 
 
ఔట్  పేషెంట్ విభాగంలో మరియు అత్యవసర పరిస్థితులకు సంబంధించిన రోగులను పరీక్షించడం లో నిర్దేశించిన  మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడం. వ్యాధిని బారిన  పడిన ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆరోగ్య కార్యకర్తల దగ్గరి   పరిచయాలు వలన ప్రభావితమైన ఆసుపత్రి యొక్క క్లస్టర్ పరిధి లో హాస్పిటల్ ను సందర్శించే దీర్ఘకాలిక వ్యాధులు వంటి రోగులకు వీరి ద్వారా ఏర్పడే ప్రమాదం స్థాయిని అంచనా వేయడం  మొదలైన వాటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం.
 
వ్యాధి మూలకారణమైన కేసు గుర్తించబడి, వేరుచేయబడిందని మరియు దానికి సంబంధించిన అన్ని పరిచయాలు గుర్తించబడి మరియు నిర్భంధించబడడమే కాకుండా  సురక్షిత చర్యల్లో భాగంగా సూచించిన ప్రమాణాలతో క్రిమి సంహారకం చేయబడిందని ఆసుపత్రి అధికారులు సహేతుకంగా సంతృప్తి చెందితే అట్టి ఆసుపత్రి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుంది.
 
పైన పేర్కొన్న చర్యలతో సమాంతరంగా , ఆసుపత్రిలో కోవిడ్-19 కేసులు  తరువాతి రోజుల్లో  గరిష్ట సంఖ్యలో  నమోదు అవుతూ ఉంటే   ఆసుపత్రి విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం మంచిది. తరువాతి దినములలో క్షుణ్ణంగా శుభ్రపరచడం మరియు క్రిమిసంహారక చేసిన తరువాత దాన్ని మళ్లీ వాడవచ్చు.
 
ఒకవేళ పై చర్యలు తీసుకున్నప్పటికీ, సంక్రమణ యొక్క ప్రాధమిక మూలాన్ని గుర్తించలేక పోతే  మరియు ఆసుపత్రి లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర రోగులలో పెద్ద సంఖ్యలో కోవిడ్ లక్షణాల కేసులను నమోదు చేస్తుంటే  కోవిడ్ కాని ఆ ఆసుపత్రిని స్థానిక ఆరోగ్య శాఖకు తెలియజేసి వారి అనుమతితో  కోవిడ్ ఆసుపత్రిగా  మార్చడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
 
అటువంటి దృష్టాంతంలో  సంబదిత ఆరోగ్య కేంద్రం  యొక్క మొత్తం ఆరోగ్య కార్యకర్తలు ప్రోటోకాల్ లో సూచించిన విధంగా సంక్రమణ నివారణ మరియు నియంత్రణ పద్ధతులు పాటించాలి.

గమనించవలసిన చర్యలు...
కోవిడ్ కాని చికిత్స కేంద్రం లో ఒకవేళ కోవిడ్-19 కేసును గుర్తించినపుడు, అతనితో ఇతర రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, గుర్తించబడని పరిచయం / కేసు యొక్క అవకాశాన్ని తగ్గించడానికి హెచ్ఐసీసీ ఈ క్రింది చర్యలు తీసుకుంటుంది. ఆసుపత్రులలోని ఉన్న ప్రతి  సిబ్బందిని పూర్తిగా  పరీక్షించడం లాంటి చర్యలు  ప్రతిరోజూ జరిగేలా చూసుకోండి (థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ముఖ్యంగా షిఫ్ట్ ప్రారంభంలో).

ఆసుపత్రిలోని ఆరోగ్య సిబ్బంది మరియు సహాయ సిబ్బంది అన్నీ సమయాల్లో వారి స్వీయ ఆరోగ్య రక్షణ చూసుకునే ప్రోత్సహించటం. అలాగే ఏదైనా కోవిడ్-19 లక్షణాలు కనిపించినపుడు వెంటనే స్పందించి సంబదిత అధికారులకు తెలియచేసి  తగిన చికిత్స సహాయం తీసుకోవడం.
 
చికిత్స పొందే రోగుల యొక్క అసంబద్ద  కదలికలు లేదా ప్రవర్తన లేదా తీసుకుంటున్న చికిత్సను గమనించండి. పాటించాల్సిన ప్రామాణిక జాగ్రత్తలు అందరూ శ్రద్ధగా పాటించడం. ఆసుపత్రి అత్యవసర మరియు ఔట్  పేషెంట్ విభాగాలలో రోగులను పరీక్షించటానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను పాటించడం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటికి వైరస్‌ను మోసుకెళుతున్నామా?.. చెప్పులకు అది అంటుకుంటుందా?