Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ప్రజారవాణా అస్తవ్యస్తం.. ఆగిన ఆర్టీసీ చక్రాలు... ఇపుడు ప్రైవేట్ క్యాబ్‌లు కూడా...

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా అస్తవ్యస్తంగా మారిపోయింది. గత 14 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను విరవించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం కూడా వారి డిమాండ్ల పరిష్కారం కోసం ఏమాత్రం చొరవచూపడంలేదు. దీంతో ఆర్టీసీ బస్సుల సమ్మె యధావిధిగా కొనసాగుతోంది. 
 
ఈ ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దీనికితోడు శనివారం నుంచి మరో షాక్ తగలింది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న దాదాపు 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ ఐకాస ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. 
 
కిలోమీటరుకు కనీసం రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్లకు మినిమమ్ బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లకు జీవో నెం.61, 66 అమలు చేయాలని.. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని కోరారు. అంతేకాదు ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments