Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Advertiesment
తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల పరంపర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పరిస్థితి గురించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వివరించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు సంబంధించి గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తమ్మీద టీఎస్ ఆర్టీసి దెబ్బతో కేసీఆర్ సర్కారుకి షాక్ తప్పేట్లు లేదు. ఉద్యోగులకు- ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరకపోవడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ, దిల్లీ సహా 50 నగరాలకు భూకంపం ముప్పు - ట్రిపుల్ ఐటీ, ఎన్‌డీఎంసీ నివేదిక : ప్రెస్ రివ్యూ