Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌ ఫీజు 30శాతం తగ్గింపు : ప్రైవేట్‌ కళాశాలలకు ఏపీ ప్రభుత్వం షాక్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:05 IST)
ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను విద్యాశాఖ జారీ చేయడం జరిగింది.

కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఒకింత హెచ్చరించింది.
 
కాగా.. రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి.

రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments