Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి ఆదాయపన్ను శాఖ అధికారులపై వేటు

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:19 IST)
అవినీతి, అక్రమాలకు పాల్పడిన విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు 85 మంది ఆదాయపుపన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడిన ఇద్దరు ఏపీ ఆదాయపుపన్ను శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రాజమండ్రి ఆదాయపన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఆమె వద్ద రూ.1.50 లక్షల లంచం డబ్బు లభించింది. విశాఖపట్టణానికి చెందిన మరో ఐటీఓ అధికారి వద్ద రూ.75 వేల లంచం సొమ్ము దొరికింది. దీంతో వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
 
రాజమండ్రి, విశాఖ ఐటీఓలతో పాటు 21 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారులను నిర్బంధ పదవీవిరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది ఐదు విడతలుగా 85 మంది ఆదాయపు పన్నుశాఖ అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వేటు వేసింది. 
 
ఇందులో 64 మంది సెంట్రల్ బోర్డు, కస్టమ్స్, సీబీడీటీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారులపై వేటు వేసేందుకే వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments