Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమపాశంలా మారిన కరెంట్ తీగలు.. సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి.. ఎలా? (వీడియో)

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (18:30 IST)
Students Electrocuted
కరెంట్ తీగలు పడివుండటాన్ని ఆ బాలుడు చూడలేదు. సంతోషంగా సైకిల్ తొక్కుతూ స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. అయితే జరగకూడనది జరిగిపోయింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధిలో విద్యుత్‌ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కడప జిల్లాల చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తన్వీర్‌ (11) అద్నాన్.. ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. స్కూలుకు వెళ్లి లంచ్ కోసం ఇంటికి వచ్చి లంచ్ చేసి సైకిల్‌పై స్కూలుకు వెళ్తున్నారు. కరెక్ట్‌గా వీధి టర్నింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మార్‌ నుంచి కరెంట్‌ వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. యమపాశాల్లా వేలాడుతున్న కరెంట్ వైర్లను సైకిల్‌పై వెళ్తున్న ఆ చిన్నారులను తాకాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. తన్వీర్ ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండంగా.. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బాబు ప్రాణాలు తీసిందని.. స్థానికులు ఆందోళనకు దిగారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే ప్రభుత్వం నుంచి చనిపోయిన విద్యార్థికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఖర్చులు భరాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments