Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 లక్షల దొంగ ఓటర్ కార్డులున్నాయి, బయట పెడతాం: బిజెపి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:00 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో సమానంగా పోటీకి సిoద్ధమైంది బిజెపి. బిజెపి నుంచి ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలోనే మకాం వేసి నేతలందరినీ కలుపుకుని సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 
 
అందరిని ఐక్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పార్టీ జాతీయ కార్యదర్సి సత్యకుమార్‌లు తిరుపతిలో ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
 
అందులో భాగంగా 2 లక్షల నకిలీ ఓటర్ కార్డులను తయారుచేసిందని దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. రెండురోజుల్లో ఎస్ఈసిని కలుస్తామన్నారు సత్యకుమార్. అంతేకాదు టిడిపి.. వైసిపి ఒక్కటై బిజెపిపై కుట్ర పన్నేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
 
రైల్వేప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామన్నారు. 5 లక్షల 23 వేల 500 కోట్ల నిధులు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. బిజెపిని రాష్ట్రంలో గెలిపించకపోయినా అభివృద్ధిలో లోటు చేయలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments