Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు మృతి.. కర్నూలులో విషాధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:36 IST)
బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మరో బాలిక తీవ్ర అస్వస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి ఇది జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
మహబూబ్ కొడుకు హుస్సేన్ బాషా(6), కూతురు హుసేన్ బీ(4) కలిసి బాబాయి కూతురు బషిరున్(8)తో కలిసి గ్రామంలోని ఓ కిరాణా షాపులో బిస్కెట్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత అంతా కలిసి వాటిని తిన్నారు. కొంతసేపటి తర్వాత చిన్నారులు మెల్లగా అస్వస్థతకు గురయ్యారు. 
 
కుటుంబ సభ్యులు దీన్ని గమనించి వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే హుసేన్ భాషా మరణించాడు. అక్కడే చికిత్స పొందుతూ హుసేన్ బీ కూడా చనిపోయింది. వెంటనే వైద్యులు మరో చిన్నారిని కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments