Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బబ్బా.. పాములే పాములు..

ఒక్క పాము కంటికి కనిపిస్తేనే ఆమడదూరం పరిగిత్తే వాళ్లు చాలామంది వుంటారు. అలాంటిది పాములన్నీ గుంపులుగా కనిపిస్తే.. ఇంకేమైనా వుందా? ఇదే సీన్ జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (13:36 IST)
ఒక్క పాము కంటికి కనిపిస్తేనే ఆమడదూరం పరిగిత్తే వాళ్లు చాలామంది వుంటారు. అలాంటిది పాములన్నీ గుంపులుగా కనిపిస్తే.. ఇంకేమైనా వుందా? ఇదే సీన్ జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి ప్రజలు విషసర్పాల భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కలుగుల్లోంచి బైటకు వస్తున్న పాములు ఎక్కడపడితే అక్కడ గుంపులుగా కనిపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. 
 
తాజాగా పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో 15 విషసర్పాలు ఓకే చోట గుంపుగా చేరి స్థానికులకు దర్శనమిచ్చాయి. దీంతో పట్టణ ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఆలయ సమీపంలో మొదట ఓ పామును స్థానికులు గుర్తించారు. దీంతో వారు సుల్తాన్ పూర్ కు చెందిన పాములు పట్టే వ్యక్తిని పిలిపించి ఈ పామును పట్టుకున్నారు. ఆ తర్వాత పరిసరాల్లో వెతగ్గా మరిన్ని పాములు కనిపించాయి. 
 
అన్నీ నాగుపాము, కట్ల పాము, తాడిజెర్రి వంటి విషపు జాతికి చెందినవే కావడంతో వాటిని పాములు పట్టే వ్యక్తి జాగ్రత్తగా పట్టుకున్నాడు. అనంతరం ప్లాస్టిక్ సంచుల్లో వాటిని బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. వర్షాకాలంలో ఇలా పాములు కలుగుల్లోంచి బైటకు వచ్చి తిరగడం మామూలేనని, ప్రజలే కాస్త జాగ్రత్తగా ఉండాలని స్నేక్ సొసైటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments