Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్‌లో సీక్రెట్ టాస్క్.. బాత్రూమ్‌లోకి వెళ్లి స్వీట్స్ తిన్నారు.. ఇదేం గోల?

బిగ్ బాస్ సీజన్ 2లో భాగంగా ఈ బుధవారం ప్రసారం చేసిన ఎపిసోడ్‌లో రాధాక్రిష్ణ, మధులత అనే రెండు బొమ్మలకు పెళ్లి, మెహిందీ, సంగీత్, శోభనం, హనీమూన్ అంటూ తెగ ఓవరాక్షన్ చోటుచేసుకుంది. నటించడ్రా బాబూ అంటే మన కంట

Advertiesment
Bigg boss 2 Telugu secreat task
, గురువారం, 23 ఆగస్టు 2018 (11:11 IST)
బిగ్ బాస్ సీజన్ 2లో భాగంగా ఈ బుధవారం ప్రసారం చేసిన ఎపిసోడ్‌లో రాధాక్రిష్ణ, మధులత అనే రెండు బొమ్మలకు పెళ్లి, మెహిందీ, సంగీత్, శోభనం, హనీమూన్ అంటూ తెగ ఓవరాక్షన్ చోటుచేసుకుంది. నటించడ్రా బాబూ అంటే మన కంటెస్టెంట్స్ తెగ రెచ్చిపోయి జీవించేసారు. ఇది సరిపోదంటూ బిగ్ బాస్ పెళ్లి పెద్దగా అనసూయను కూడా ఇంట్లోకి పంపించారు. 
 
ఆమె తన వంతు ఓవరాక్షన్ చేసి, మూడు పాటలకు స్టెప్పులు వేసి ముగించేసారు. ఇదేదో రసవత్తరంగా జరుగుతోందని భావించిన బిగ్ బాస్ పెళ్లి కూతురు అమ్మానాన్నలుగా నటిస్తున్న గీతా, అమిత్‌లను పిలిచి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ఆరా తీయడం, ఇలాగే చేయండంటూ చెప్పడం నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు.
 
ఇకపోతే ఎప్పట్లాగే బిగ్ బాస్ ఈ సందట్లో సడేమియా అంటూ రోల్ రైడా, సామ్రాట్‌కు కొన్ని సీక్రెట్ టాస్క్స్ ఇచ్చారు. పోస్ట్ బాక్స్‌లో ఉంచిన స్వీట్ బాక్స్‌లను ఎవరికీ తెలియకుండా తినమని, సామ్రాట్‌కి పెళ్లి కూతురు చెల్లిని పెళ్లికి ఒప్పించమని, రోల్ రైడాకి పూజారి గణేష్‌ను స్విమ్మింగ్ ఫూల్‌లోకి తోయమని, పెళ్లి కూతురు తల్లికి (గీతా మాధురి) ముద్దు పెట్టమని సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చారు.
 
స్వీట్స్ టాస్క్ విషయానికి వస్తే సామ్రాట్ పోస్ట్ బాక్స్‌లో ఉంచిన డబ్బాలలో ఒకటి తీసుకుని వాషింగ్ బేసిన్స్ వద్ద తినేయగా, రోల్ రైడా ఒక అడుగు ముందుకేసి బాత్రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకుని మరీ తిన్నాడు. ఈ పెళ్లి గోలేంటో, సీక్రెట్ టాస్క్‌లేంటో మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడల్ట్ స్టోరీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రష్మీ...