టెన్త్ పాసైన ఆనందంలో కూల్‌డ్రింక్స్ కోసం వెళ్తే టాటా ఏస్ కాటేసింది...

Webdunia
బుధవారం, 15 మే 2019 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ఇలా పాసైన వారిలో రుక్మిణి అనే బాలిక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. టెన్త్ పాసయ్యానన్న ఆనందంలో కూల్‌డ్రింక్స్ తెచ్చి తన స్నేహితులకు ఇవ్వాలని రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ కంపెనీ ఆ బాలికను ఢీకొట్టింది. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కలవచర్ల గ్రామంలో జరిగింది. పదో తరగతి ఫలితాలు రాగానే, ఆనందంతో తన చెల్లెలితో కలిసి తిరుగుపల్లి రుక్మిణి (15) రోడ్డు పక్కన ఉండే ఓ దుకాణానికి శీతలపానీయం కోసం వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ - మ్యాజిక్ అక్కాచెల్లెళ్లను ఢీక్కొట్టింది. 
 
ఈ ఘటనలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఆమె చెల్లికి గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రుక్మిణి సోదరిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు టాటా ఏస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments