Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలలో 10-వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, సత్యసాయి జిల్లా, కదిరి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత తొమ్మిది నెలల ముందు తాగునీటి కోసం స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. 
 
ఆ సమయంలో స్టాఫ్ రూమ్‌లో వున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటనను ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యంపై ఎవ్వరికీ చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న రెడ్డి నాగయ్య పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె నిండు గర్భిణీ అని తేల్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
పురిటి నొప్పులు రావడంతో ఆ బాలికకు అబ్బాయి పుట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం