Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజీ బస్సు.. వేర్వేరు ప్రాంతాల్లో..?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:03 IST)
Accident
ఏపీలోని నంద్యాల జిల్లాలోని తమ రాజు పల్లె సమీపంలో మూలమెట్ట పెద్దమ్మ తల్లి యూటర్న్ వద్ద విజయానికేతన్ స్కూల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
సంఘటన అనంతరం చిన్నారులను ఇళ్ళకు తిరిగి పంపించేశారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
మరోవైపు తమిళనాడులోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి-తిరువానైక్కావల్‌లో స్కూలు వ్యానును కాలేజీ బస్సు ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో పాటు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
ఈ ప్రమాదంతో తిరువానైకావల్ శ్రీరంగం ప్రధాన రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments