Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్... : ఏపీలో 55, తెలంగాణాలో 52 శాతం

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (16:10 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49 శాతం, తెలంగాణలో 52.34 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
 
ఏపీ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43 శాతం, అత్యల్పంగా విశాఖపట్నంలో 47.66 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. 
 
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ కదిలివచ్చి ఓటేయండి : సీఎం జగన్ ట్వీట్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
ఫలితంగా ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మూడో ఎన్నికలు ఇవి. గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా మాత్రం సుదూర ప్రాంతాల నుంచి సైతం ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. 
 
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశఆరు. "నా అవ్వతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ.. అందరూ కదిలి రండి. తప్పకుండా ఓటు వేయండి" అంటూ తన సందేశం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments