Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కంటే ఎక్కువ కేసులు ఉన్న వైసీపీ నేత ఈయనే!

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:38 IST)
వైకాపాలో ఎక్కువ భాగం టికెట్లు నేర చరిత్ర ఉన్న వారికే ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఘోషిస్తున్నారు. అయితే, మొత్తం మీద అందరి కంటే ఎక్కువగా కేసులు ఎదుర్కొంటున్న వైకాపా నేత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనే అందరూ భావిస్తారు.. కానీ ఆయన్ని మించిపోయిన వాళ్లు కూడా పార్టీలో ఉన్నారని తాజా సమాచారం. 
 
వివరాలలోకి వెళ్తే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన మీద 31 కేసులు ఉన్నాయని పేర్కొంటూ... ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయగా... వైకాపా తరపున పోటీ చేస్తున్న వారిలో అనేక మందిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ... వీళ్లందరి కంటే ఎక్కువగా 32 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ... ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తి... అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి.
 
సదరు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఏకంగా 32 క్రిమినల్ కేసులు ఉండగా... ఈ కేసులు 1985 నుండి 2019వ సంవత్సరం వరకు నమోదై ఉన్నాయి. 1987వ సంవత్సరంలోనే పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరిచారు. తుపాకులు, బాంబులతో దాడి చేయడం, కిడ్నాప్, హత్యలు, ఆస్తులను నష్టపరచడం లాంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయి. 
 
ఈయనపై ఉన్న కేసుల్లో అత్యధికంగా యల్లనూరు పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అయితే, వీటిలో కొన్ని కేసులను కోర్టులు కొట్టివేసాయని కేతిరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరి అధినేత కంటే ఎక్కువ కేసులు ఉన్న అభ్యర్థిగా ఈయన రికార్డులకు ఎక్కుతారేమో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments