Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వక్కర్లేదు... కె.ఎ. పాల్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:23 IST)
ఏపీ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే వున్నది. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకులు తమ మాటలకు మరింత పదునుపెట్టేశారు. ముఖ్యంగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికల పర్యటనలో వున్న ఆయన మాట్లాడుతూ... '' జయమ్ము నిశ్చయమ్మురా భయంబు లేదురా... ఏంటి రెస్పాన్సు. నేను ఎక్కడికెళ్లినా జనం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేస్తామని చెపుతున్నారు.
 
ఇతర పార్టీల మాదిరిగా రోడ్ షోలు చేసేటప్పుడు సభకు వచ్చేవారికి నిలబడటానికి వెయ్యి రూపాయిలు, కూర్చోవడానికి రూ. 2 వేలు, పడుకోవడానికి రూ. 10 వేలు ఇవ్వాల్సిన పనిలేదు. నరసాపురంలో ర్యాలీ చేయబోతున్నా. నాకు గ్లాసు పగిలిపోయిందని చెప్పాల్సిన పనిలేదు. చైన్ ఊడిపోయిందని చెప్పాల్సినవసరంలేదు.
 
మా పార్టీకి బూత్ కమిటీలు కూడా లేవు. అసలు రేపటి పర్యటన షెడ్యూల్ ఏమిటో నాకు తెలియదు. మీరు ఏ జెండాలు మోసినా హెలికాప్టర్ గుర్తుపైనే గుద్దండి. జగన్-బాబు-పవన్‌లకు ఏ గతీ లేదు. వాళ్లు మా గుర్తు హెలికాప్టర్లోనే ఎక్కి తిరుగుతున్నారు. నాకు అధికారం ఇస్తే ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేసి చూపిస్తా'' అంటూ చిటికెలు వేసి చెపుతున్నారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments