Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ముగియనున్నఅనంతబాబు కస్టడీ... కోర్టులో హాజరు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (14:09 IST)
తన కారు మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టు అయిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ సోమవారంతో ముగియనుంది. దీంతో ఆయన్ను రాజమండ్రి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన్ను రిమాండ్‌లోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం రిమాండ్‌కు అప్పగించాలని కోరుతూ పోలీసుల తరపున పిటిషన్ దాఖలు చేయనున్నారు.
 
మరోవైపు, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనంతబాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విచారణలో కోర్టు ఆయనకు రిమాండ్‌ను పొడగిస్తుందా లేదా బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు, అనంతబాబుకు కఠిన శిక్ష విధించాలని రాష్ట్రంలోని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments