ఆ డబ్బు ఏం చేశావ్ అంటూ నా భార్య ప్రశ్నిస్తుంది : వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు

Webdunia
బుధవారం, 26 జులై 2023 (09:54 IST)
అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బంతా ఏం చేశావంటూ నా భార్య ప్రశ్నిస్తుందని, ఇపుడు నా భార్యకు ఏం సమాధానం చెప్పాలని వైకాపా వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తన పాదయాత్రలో వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు రాజకీయాల్లో అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేశారు. 
 
ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ, "రాజకీయాల్లో నేను అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించానని పాదయాత్రలో లోకేశ్‌ ఆరోపించారు. నేను ఆయన ప్రసంగాన్ని చూడలేదు. నా భార్య టీవీలో చూశారు. నువ్వు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నావని ఆవిడ ప్రశ్నిస్తోంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దీంతో మా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయ"ని వ్యాఖ్యానించారు. 
 
ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలన్నారు. తెదేపా కంటే వైకాపా ప్రభుత్వంలోనే గ్రానైట్‌ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments