Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబాయ్‌ని అబ్బాయే చంపేశాడు... నారా లోకేశ్ ట్వీట్

nara lokesh
, శుక్రవారం, 21 జులై 2023 (18:54 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తయారు చేసిన చార్జిషీటును కోర్టులో సమర్పించింది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ 259వ సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చింది. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని రాజకీయ కారణాలతోనే చంపేశారని వెల్లడించనట్టు చార్జిషీటులో పేర్కొంది. ఇపుడు ఈ వార్త సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 
 
"అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడు. అది జగనాసుర రక్త చరిత్ర" అని షర్మిల కూడా తేల్చేశారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారు. అవినాష్‌ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే కారణంగా షర్మిల పేర్కొన్నారు అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.
 
వివేకానంద రెడ్డి హత్య కేసులో 259వ సాక్షిగా సీబీఐ ఎదుట హాజరైన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 'నా వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు.. పెద్ద కారణం ఉంది. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. 
 
కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారు. ఖచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబాయ్‌ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను’’ అని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన వ్యక్తి అరెస్టు