చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదు.. రైతుల్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం...?

Webdunia
శనివారం, 18 మే 2019 (12:50 IST)
రైతులను మోసం చేసి అక్రమంగా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును వదలబోనని వైకాపా మ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అంతేగాకుండా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయినప్పటికీ.. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాజధాని మార్పు జరుగుతుందని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 
దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారని ఆళ్ల తెలిపారు. అయితే రైతులను మోసం చేసి బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నం మాత్రం తమ ప్రభుత్వం చెయ్యదని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments