Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత కంటు పాపారావు మృతి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (17:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కంటు పాపరావు(64) సోమవారం గుండెపోటుతో మరణించారు. పాతబస్తీ శివాలయం వీధిలోని షణ్ముఖ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాలెస్ అధినేతగా సుప్రసిద్ధుడైన పాపారావు, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విశేషంగా కృషి చేశారు. 
 
వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయ, సేవారంగాలలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న పాపారావు మరణం తమను ఎంతగానో కలచివేసిందని బులియన్ వ్యాపారుల సంఘం నేతలు పేర్కొన్నారు. 
 
వ్యాపార వర్గాల్లో తనకున్న విశేష పరిచయాలతో వైసీపీ విజయానికి కృషి చేసిన పాపారావు మృతి పట్ల ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తంచేశారు. పాపారావు మృతి తమ పార్టీకి తీరనిలోటని వారు సంతాపం వెలిబుచ్చారు. కంటు పాపారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పాపారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన పెద్ద కుమారుడు కంటు మహేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments