రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే కంగాటి అనుచరులు - టోల్ ప్లాజా ధ్వంసం

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు, వారి అనుచరగణం అధికారమదంతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డుతగిలేవారిని, వ్యతిరేకించేవారిని, తమ మాటకు అడ్డు చెప్పేవారిపై దాడి చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజపై వైకాపా కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు. 
 
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఈ టోల్‌ప్లాజాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా అంటూ టోల్‌ప్లాజాను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రాణభయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఎమ్మెల్యే శ్రీదేవి జిల్లాలోని తుగ్గలి మండలం పర్యటనను ముగించుకుని డోవ్ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. 
 
తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడి ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... ఈ దాడి ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments