ఏపీ బడ్జెట్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ఇంకా ఏపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఈ రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు-అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.
కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారు. ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోందని.. కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.
రూ. 48 వేల కోట్ల ఖర్చులకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్ చెప్పిందని గుర్తుచేశారు. ఆ రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించిన యనమల.. మా లెక్క ప్రకారం రూ. 48 వేల కోట్ల కంటే ఎక్కువగానే దోపిడీ జరిగిందన్నారు.