వివేకా హత్య కేసు : మరో నలుగురు అనుమానితుల వద్ద విచారణ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ  కేసు దర్యాప్తులో భాగంగా మరో నలుగురు అనుమానితులను విచారించారు. 
 
వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్‌ రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్‌ రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. 
 
అదేవిధంగా, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో కాల్‌డేటా ద్వారా వివరాలు సేకరించారు. 
 
ఈ కాల్ డేటా ఆధారంగా అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు.. ఆన తండ్రిని సీబీఐ విచారణ జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments