Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కౌన్ బనేగా కరోడ్‌పతి.. అతిథులుగా దాదా, సెహ్వాగ్..

Advertiesment
KBC 13
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:47 IST)
KBC 13
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఇప్పటివరకు 12 సీజన్లు ముగిశాయి. తాజాగా... శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్‌ మొదలవుతోంది. తొలివారం టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అతిథులుగా వచ్చారు.

కెరీర్‌ సహా అనేక విశేషాలు చెబుతూ అలరించారు. ఈ షోలో దాదా, వీరూ రూ.25లక్షలు గెలిచారు. రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్‌గా మారింది.
 
సాధారణంగా అమితాబ్‌ బచ్చన్‌ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును దాదా తీసుకొని బిగ్‌బీని హాట్‌సీట్లో కూర్చోబెట్టారు. యాంకర్‌గా గంగూలీ ప్రతిభను చూసిన బిగ్‌ బీ.. 'ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో' అని సరదాగా వ్యాఖ్యానించారు. దానికి 'ఒకవేళ నేను హోస్ట్‌ చేయాల్సి వస్తే ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటాను' అని దాదా బదులిచ్చారు. సెహ్వాగ్‌ తనదైన రీతిలో హాస్య గుళికలు విసిరాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత సమాధికి 'తలైవి' కంగనా పుష్పాంజలి