Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (18:17 IST)
పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య మృతికి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్లక్ష్యమే ముమ్మాటికీ కారమణని ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ, జగన్ చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పకుండా ఫేక్ వీడియో ఒకదాన్ని రిలీజ్ చేసి మభ్యపెట్టడం దారుణమన్నారు. 
 
జగన్ వ్యవహారశైలిపై తీవ్రంగా విమర్శలు ఆమె గుప్పించారు. మానవత్వం ఉంటే రూ.5 కోట్లు, రూ.10 కోట్లు పరిహారం ఇచ్చి క్షమించవచ్చని అడగాలి గుప్పించారు. ఇపుడు ప్రజా సమస్యలంటూ బయల్దేరడం విడ్డూరంగా ఉందాన్నారు. జగన్‌వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజలు కోసం కాదు. డబ్బుంది, బలముందని జగన్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఆయన జనసమీకరణాలకు అనుమతులు ఇవ్వొద్దని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారందర్నీ విచారణకు పిలిపించాలి. కారు కింద ఓ మనిషి పడిపోయాడని కనీస స్పృహ కారులో ఉన్న వారందర్నీ విచారణకు పిలవాలి. కారు కింద ఓ మనిషి పడిపోయాడని కనీస స్పృహ లేదు కారులో ఉన్న వాళ్లు అలాగే ముందుకు వెళ్లడం దారుణమన్నారు. 
 
తప్పు జరిగితే ఒప్పుకోకుండా ఫేక్ అంటూ సమర్థించుకుంటారా? జగన్ సైడ్ బోర్డ్ మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన పర్యటనకు అనుమతి ఇచ్చింది. దాదాపు 5 వాహనాలకే అనుమతి కానీ, ఆయన 50 వాహనాల్లో వెళ్ళి, సైడ్ బోర్డుపై నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఇది జగన్ తప్పు కాదా? జగన్‌కు మానవత్వం అనే పదానికి అర్థం తెలియదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments