Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 17న నా కుమారుడు రాజారెడ్డి వివాహం : వైఎస్ షర్మిల

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (17:58 IST)
వచ్చే నెల 17వ తేదీన తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరుగనుందని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరుగుతుందని షర్మిల తెలిపారు. రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని వెల్లడించారు.
 
నిజానికి రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై షర్మిల ఎక్కడా నోరు విప్పలేదు. ఈ క్రమంలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన నిశ్చితార్థం జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరుగుతుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 2వ తేదీ మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తాం. అక్కడ ఆహ్వాన పత్రికను ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం" అని ట్వీట్ చేశారు. 
 
కాగా, వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరిది ప్రేమ వివావహం. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం రాజారెడ్డి అమెకాకు వెళ్లగా, అక్కడ ప్రియ పరిచయమయ్యారు. వీరిద్దరూ తొలుత స్నేహితులుగా ఉండగా, ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. రాజా, ప్రియా ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపడంతో త్వరలోనే ఈ జంట ఒక్కటికానుంది. అమెరికాలోని డల్లాస్‌ యూనివర్శిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు రాజా పూర్తి చేశారు. చట్నీస్ అధినేత అట్లూరి మనవరాలే ప్రియా. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియకు.. అమెరికాలో కూడా పౌరసత్వం ఉండటం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments