Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీల్లో వైయస్‌.జగన్‌ సామాజిక న్యాయం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (21:02 IST)
అమరావతి: సామాజిక న్యాయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ తాజా నామినేటెడ్‌ ఎమ్మెల్సీల్లోనూ తన వినూత్నతను చాటుకున్నారు. సహజంగా ఇలాంటి ఎన్నికల్లో లాబీయింగ్, ఆర్థికస్థోమత, రాజకీయ ప్రాబల్యం లాంటి అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాని, వీటన్నింటినీ వైయస్‌.జగన్‌ పూర్తిగా పక్కనపెట్టారు. సమాజంలో దిగువనున్న కులాలకు మరోసారి ప్రాధాన్యత కల్పించారు.

గవర్నర్‌నామినేటెడ్‌ ఎమ్మెల్సీల్లో తన బీసీ యాదవ కులానికి సీఎం సముచిత ప్రాధాన్యం కల్పించడంద్వారా తన సొంత జిల్లా కడపలో సామాజిక న్యాయానికి వైయస్‌.జగన్‌ పెద్దపీట వేశారు. సీఎం నిర్ణయం వల్ల కడపజిల్లాలో ఆరున్నర దశాబ్దాల్లో తొలిసారిగా బీసీ యాదవ కులానికి చెందిన వ్యక్తి రమేష్‌యాదవ్‌ గవర్నర్‌కోటాలో నామినేట్‌ అయ్యారు. రమేష్‌యాదవ్‌కు విద్యావేత్తగా పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1958లో ఏపీలో శాసనమండలి ఏర్పాటైంది. అప్పటినుంచి కడప జిల్లానుంచి 30 మంది ఎమ్మెల్సీలగా ఎన్నికయ్యారు. వైయస్‌.జగన్‌ నిర్ణయం కారణంగా తొలిసారిగా యాదవులకు ఎమ్మెల్సీగా స్థానం లభించింది. 
 
గవర్నర్‌ కోటా కింద నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే... ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లకు గవర్నర్‌ ఈనెల 10వ తేదీన ఆమోదం తెలిపారు. ఈ నాలుగు సీట్లలో 2 ఎస్సీ, బీసీలకు వైయస్‌.జగన్‌ కేటాయించారు. ఒక సీటును పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సీకులానికి చెందిన మోషేన్‌రాజుకు ఇవ్వగా, కడపజిల్లాకు చెందిన రమేష్‌ యాదవ్‌కు రెండో సీటు ఇచ్చారు. మిగిలిన రెండింటిలో తూర్పుగోదావరిజిల్లాకు చెందిన తోట త్రిమూర్తులకు, గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిలను నామినేట్‌చేశారు.
 
2019లో అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల కోటాకు గానూ 5 స్థానాల్లో పూర్తి కాలానికి, మరో 4 స్థానాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగాయి. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో 2 స్థానాలకు గత ఏడాది ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. తాజా 4 ఎమ్మెల్సీలను గవర్నర్‌ నామినేట్‌ చేశారు. అంటే మొత్తంగా 15 ఎమ్మెల్సీలకు నామినేటెడ్, ఎమ్మెల్యే కోటాల కింద ఎన్నికల లెక్కన భర్తీచేస్తే ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు ఇచ్చారు. 2018 తర్వాత భర్తీచేసి ఎమ్మెల్సీలో 12 ఎస్సీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. 3 ఓసీలకు ఇచ్చారు. సామాజిక న్యాయానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైయస్‌.జగన్‌ ఇస్తున్న సముచిత ప్రాధాన్యతం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి రాకముందు బీసీకి చెందిన జంగాకృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశంకల్పించింది. 
 
2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ తరఫున ఎన్నికైన, నామినేట్‌ అయిన సభ్యులు:
 
పండువుల రవీంద్ర బాబు  (ఎస్సీ)
బల్లికళ్యాణ చక్రవర్తి  (ఎస్సీ)
డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ( ఎస్సీ)
కొయ్య మోషేన్‌రాజు (ఎస్సీ)
 
మోపిదేవి వెంకట రమణ (బీసీ) ( తర్వాత ఈయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగిలిన కాలానికి ఈయన స్థానంలో పీవీవీ సూర్యనారాయణ రాజుకు పార్టీ అవకాశం కల్పించింది)
దువ్వాడ శ్రీనివాస్‌ ( బీసీ)
పోతుల సునీత (బీసీ)
రమేష్‌యాదవ్‌  (బీసీ)
సి.రామచంద్రయ్య ( బీసీ)
 
జకియా ఖానుం ( మైనార్టీ)
మహ్మద్‌ ఇక్బాల్‌ (మైనార్టీ)
మహ్మద్‌ కరీమున్నీసా ( మైనార్టీ)
 
చల్లా భగీరథరెడ్డి ( ఓసీ)
లేళ్ల అప్పిరెడ్డి (ఓసీ)
తోట త్రిమూర్తులు (ఓసీ)

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments