Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనందయ్య మందు విషయంలో అధికార పార్టీ రాజకీయం చేస్తోంది

Advertiesment
ఆనందయ్య మందు విషయంలో అధికార పార్టీ రాజకీయం చేస్తోంది
, శనివారం, 12 జూన్ 2021 (15:45 IST)
ఆనందయ్య మందు విషయంలో అధికార పార్టీ రాజకీయం చేస్తోందని, ఆయన ఉచితంగా ఇస్తున్న మందు విషయంలో స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి వేలు పెట్టాడని, ఆనందయ్యను అరెస్ట్ చేసి, వేరే ప్రాంతంలో ఉంచి, మందు తయారు చేయించి తమకు అవసరమైనవారికి ఇచ్చుకున్నారని, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో, తిరిగి ఎమ్మెల్యేనే మందు పంపిణీచేస్తామని చెప్పాడని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తెలిపారు. శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
 
ఆనందయ్య మందుపంపిణీనిలిచిపోవడంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతీసుకున్నారని, కేంద్ర ఆయుష్ సంస్థలతో మాట్లాడటం జరిగిందన్నారు. జనమంతా ఆనం దయ్య మందుకావాలని కోరుకుంటుంటే, ప్రభుత్వం అడ్డుకో వడం తగదన్నారు. హైకోర్టుకి కూడా ఆనందయ్య మందుపై ప్రభుత్వం, అధికారులు అబద్ధాలు చెప్పారని చెంగల్రాయుడు చెప్పారు.

చివరకు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆనందయ్యమందుపంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇంతజరిగినాకూడా ఆనందయ్యను మందు పంపిణీ చేయకుండా అడ్డుకుంటూనే ఉన్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ఆనందయ్యతో పాటు, ఆయన కుటుంబసభ్యుల మధ్యన కూడా అధికారపార్టీ వైషమ్యాలు రాజేసిందన్నారు. ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందు పంపిణీకి స్థానిక ఎమ్మెల్యేనే వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని చూడటానికి ప్రయత్నించారన్నారు.

ఆ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీయడంతో తరువాత తమకేమీ సంబంధంలేదని బుకాయించారన్నారు. మందు అమ్మకాలను ఆనందయ్యతో పాటు, ఆయన కుటుం బసభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారని, కానీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలే ముఖ్యమంత్రి ఫోటోలతో ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వం మందును అమ్ముకోవాలని చూడకుండా, తనకు సహకరిస్తే మరింతమందికి మందును అందిస్తానని ఆనందయ్య చెబుతున్నా ప్రభుత్వం ఆయనమాటలు పెడచెవిన పెట్టిందన్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వైసీపీనేతలంతా ఆనందయ్యతీసుకెళ్లి, మందుతయారు చేయించి, అంతా తామే చేసినట్టు ప్రచారం ప్రారంభించారన్నారు. ప్రభుత్వం తరుపున సహాయసహకారాలు అందించాల్సినవారే, వారి స్వలాభం కోసం ఆనందయ్య మందుని దుర్వినియోగం చేయడం బాధాకరమని చెంగల్రాయుడు వాపోయారు. ఆనందయ్య మందుపై ప్రజలకు గురి కుదిరాక, ప్రభుత్వం ఎందుకిలా రాజకీయాలు చేస్తోందో తెలియడంలేదన్నారు.

ఎవరో చేస్తున్న పనిని, వారు పడుతున్నకష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రభుత్వం, అధికారులు, వైసీపీ నేతలు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఆనందయ్యను పోలీసులు వేధింపులకు గురి చేశారని, ఆయన్ని అనధికారికంగా నిర్బంధించడం కూడా జరిగిందన్నారు. మెడిసిన్ తయారీ కంపెనీలు కొన్ని ప్రభుత్వంతో కుమ్మక్మై, ఆనందయ్య మందుని అడ్డుకున్నాయని, మందు పంపిణీ జరిగితే ఫార్మా కంపెనీలు మూసేయాల్సి వస్తుందన్న భయంతోనే నిలువరిస్తున్నాయ న్నారు.

తమిళనాడులో కూడా ఒక వ్యక్తి ఉచితంగా మందు అందిస్తుంటే, ఆయన్ని జైల్లోపెట్టించడం జరిగిందన్నారు. కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం, ఆనందయ్య ప్రాణాలకు కూడా హాని తలపెట్టడానికి సిద్ధమైందనే సమాచారం ఉందన్నారు. ఆనందయ్య మందుపంపిణీని టీడీపీ కూడా సమర్థించిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆనందయ్య మందుని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు చొరవతీసుకోవడం లేదన్నారు.

మందు పంపిణీకి ప్రభుత్వంకట్టుబడి ఉంటే, ఆ దిశగా ఏంచర్యలు తీసుకున్నారోచెప్పాలని టీడీపీఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఆనందయ్యనునిర్బంధించాల్సిన అవసరం ప్రభుత్వానికి, పోలీసులకు ఎందుకొచ్చిందన్నారు? కేవలం కోర్టుకిభయప డే గతంలోకూడా ఆనందయ్యను నిర్బంధించి, తిరిగి విడుదల చేసిందన్నారు. రూ.167కు మందు అమ్మడానికి వెబ్ సైట్ సృష్టించారని, దానిపై సోమిరెడ్డి నిలదీయడంతో ఆయనపై తప్పుడుకేసులు పెట్టారన్నారు. మందు తయారుచేసే ఆనందయ్యపై కేసులుపెట్టడం, ఆయన్ని ఎందుకు నిర్బంధించారన్నవారిపై కేసులుపెట్టడం, మందు అమ్ముతున్నారనిచెబుతున్నవారిపై కేసులుపెట్టడం ఇవన్నీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

ఆనందయ్య మందుపంపిణీచేస్తున్నామని కోవిడ్ నిబంధనలుధిక్కరించి, భారీగాప్రచారంచేసి, జనాలనుపోగు చేసిన స్థానికఎమ్మెల్యేపై కేసులుపెట్టాలిగానీ, సోమిరెడ్డిపై పెట్టడమేంటన్నారు.  ఒక్కనయాపైసా కూడా మందుతయారీకి, ఆనందయ్యకు ఇవ్వని ప్రభుత్వం, దానిపంపిణీ అంతా తామేచేస్తున్నట్టు ప్రచారంమాత్రం ఘనంగాచేసుకుంటోందన్నారు. చివరకు మందుని రూ.30వేలవరకు బ్లాక్ లో కూడా విక్రయించారన్నారు. ఆనందయ్య ఇంట్లో మందుతయారుచేసుకోవడానికి కూడా ఈప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడంలేదన్నారు?

వైసీపీప్రభుత్వం ఆనందయ్యను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఫార్మా, మెడికల్ కంపెనీలతో  కుమ్మక్కైన ప్రభుత్వం, వారిచ్చే ముడుపులకు ఆశపడి, కావాలనే ఆనందయ్య మందుని అడ్డుకుంటోందన్నారు. ముఖ్యమంత్రికి ఆనందయ్య మందు తాలూకా సమాచారం తెలియదా..లేక తెలియనట్టు నటిస్తున్నారా అని టీడీపీఎమ్మెల్సీ నిలదీశారు. తన పూర్వీకులనుంచి తనకు వారసత్వంగా సంక్రమించిన మందుతయారీని ఆనందయ్య చేపట్టకుండా అడ్డుకోవడం ఎంతమాత్రం తగదని చెంగల్రాయుడు హితవుపలికారు.

ఏం తప్పుచేశారని చంద్రమోహన్ రెడ్డిపై ప్రభుత్వం తప్పుడుకేసులు పెట్టిందో చెప్పాలన్నారు. ఫలానారోజు నుంచి ఆనందయ్య మందుపంపిణీచేస్తామని ప్రభుత్వం ఎందుకుఘంటాపథంగా చెప్పలేకపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మందుతయారీకి అవసరమైన ఆర్థికసాయాన్ని, మూలికలను తక్షణమే ఆనందయ్యకు సమాకూర్చాలని చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆనందయ్య మందుమరింత బాగా తయారయ్యేలా ఏపీ ప్రభుత్వం చొరవతీసుకోవాలన్నారు. అలానే స్థానిక ఎమ్మెల్యేపై ప్రభుత్వం వెంటనే డిజాస్టర్  మేనేజ్ మెంట్ కింద చట్టపరంగా చర్యలుతీసుకోవాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాలంలో నిండు గర్భిణి సేవలు.. అన్నపూర్ణమ్మ సేవలు అదుర్స్