Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా... బెంగుళూరు ప్యాలెస్‌కు మాజీ సీఎం జగన్?!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (09:22 IST)
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు బెంగుళూరులోని తన సొంత ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. సోమవారం బెంగుళూరుకు చేరుకునే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. నిజానికి గత ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన తాడేపల్లి నుంచి పులివెందుల, అక్కడ నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి బెంగుళూరుకు చేక్కేశారు. జూన్ 27వ తేదీన బెంగుళూరుకు వెళ్లిన జగన్.. జూలై ఒకటో తేదీ వరకు అక్కడే ఉన్నారు. ఇపుడు కేవలం రెండు వారాల వ్యవధిలో మరోమారు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. 
 
నిజానికి ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా.. లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై వైకాపా నుంచి కానీ.. ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ స్పష్టత రాలేదు. బెంగుళూరుకు వెళ్లే జగన్ వారం రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. 
 
మరోవైపు, సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. ఇందులో పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే అది వాయిదా పడింది. 
 
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన స్పందన ప్రారంభం కాకుండా వాయిదాలతోనే ఐదేళ్లు గడిపేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాల్ని వాయిదాలు వేస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే తమ అధినేత జగన్ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని, ఆయన మాటలు ఒట్టి మాటలేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments