Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లీజ్ ఒక్కసారి అనుమతించండి.. సీఎంకు సారీ చెప్పాలి : ఐపీఎస్ సీతారామాంజనేయులు

seetharamanjaneyulu

వరుణ్

, సోమవారం, 8 జులై 2024 (14:11 IST)
గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇపుడు ఏపీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, అలాంటివారిని చంద్రబాబు,  పవన్ కళ్యాణ్‌లు ఏమాత్రం దరిచేరనీయడం లేదు. ఇలాంటి వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఒకరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసుపెట్టడంలోనూ ఆయన్ను జైలుకు పంపించడంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇపుడు ఆయన సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, సీఎం కార్యాలయం లేదా ఆయన నివాసం సెక్యూరిటీ మాత్రం అపాయింట్మెంట్ ఉంటేనే లేనికి అనుమతిస్తామని పేర్కొంటూ, లేనిపక్షంలో అనుమతించేది లేదన స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా సీతారామాంజనేయులు గేటు బయట నుంచే వెనక్కి గంటేస్తున్నారు.
 
గత ప్రభుత్వంలో నిఘా విభాగం మాజీ అధిపతి పి.సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అపాయింట్మెంట్ లేకున్నా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఉండటంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు సీతారామాంజనేయులు శని, ఆదివారాల్లో మూడు సార్లు వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు వద్దే ఆపేసి వెనక్కి పంపించేశారు. ముందస్తు అపాయింట్మెంట్లు, అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవర్నీ కలవడం లేదని చెప్పి తిప్పి పంపించేశారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా అందుకు నిరాకరించారు.
 
జగన్ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ఐపీఎస్ అధికారి... ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. సీఎం అనుమతి ఇవ్వకున్నా, పిలవకున్నా పదే పదే ఆయన్ను కలిసేందుకు యత్నిస్తున్నారు. జూన్ 6న ఉండవల్లిలోని నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా.. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచే వెనక్కి పంపించేశారు. 
 
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్ 13న తొలిసారి సచివాలయానికి వెళ్లగా అప్పుడు సీతారామంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ అధికారులు వెనక్కి పంపించేశారు. వైకాపాతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ : డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏమిటి?