Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 30న తిరుమలకు సీఎం వైయస్‌.జగన్‌ ... షెడ్యూల్ ఇదే...

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (10:39 IST)
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 30వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్తారు. తిరుచానూరులో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడనుంచి అలిపిరి వెళ్తారు. 
 
అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుమల వెళ్తారు. తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్‌నిర్మాణానికీ సీఎం శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబరు ఒకటో తేదీన ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments