Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జగన్ గృహప్రవేశం

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:13 IST)
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ ప్రవేశం చేశారు. అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన సతీసమేతంగా ప్రవేశించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో తమకంటూ సొంత ఇల్లు ఉంటే పార్టీ కార్యకలాపాలకు కూడా బాగుంటుందనే అభిప్రాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటికి బుధవారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి సతీసమేతంగా గృహ ప్రవేశంచేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.
 
గృహ ప్రవేశం అనంతరం ఆ పక్కనే నిర్మించిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments