Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కేంద్రంలో ఉమ్మేసిన కరోనా వైరస్ రోగి... ఖాకీల సీరియస్

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (13:58 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాంటి వైరస్‌ సోకి బాధపడుతున్న ఓ వెధవ పనికిమాలిన చర్యకు పాల్పడ్డాడు. ఓ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఉమ్మ వేశాడు. దీంతో ఈ ఆ కేంద్రంలోకి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఇతరులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచివుంది. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్‌ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. 
 
అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరంతో పాటు కరోనా లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తర్వాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments