ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సంఖ్య డబుల్ సెంచరీ దాటిది. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు శునివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 34 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 226కి పెరిగింది.
గత 12 గంటల్లో ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 34, గుంటూరులో 30, కృష్ణాలో 28 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఈ కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే,
అనంతపూరంలో 3, చిత్తూరులో 17, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 30, కడపలో 23, కర్నూలులో 27, నెల్లూరులో 34, ప్రకాశంలో 23, విశాఖపట్టణంలో 15, వెస్ట్ గోదావరిలో 15 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాదు. రాష్ట్రంలో ఈ రెండు జిల్లాలు మాత్రమే కరోనా రహిత జిల్లాలుగా ఉన్నాయి.