Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురినే కాటేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (13:50 IST)
కన్నకూతురినే తండ్రి కాటేశాడు. కన్నతండ్రి కామపిశాచిగా మారి.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయరాయి గ్రామానికి చెందిన భార్యాభర్తలు గొడవల కారణంగా అదేగ్రామంలో విడివిడిగా ఉంటున్నారు. వారి కుమార్తె (14 ఏళ్లు) తండ్రి వద్దనే ఉంటోంది. 
 
బాలిక తండ్రి కొద్ది రోజులుగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతండటంతో మూడు రోజుల క్రితం ఏలూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఇంటి నుంచి బయలుదేరింది. ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి తనతో తీసుకువెళ్లి రెండు రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం బాలికను విజయరాయి గ్రామంలో వదిలివేశాడు. 
 
బాలిక తల్లి వద్దకు చేరి విషయం చెప్పడంతో గ్రామస్తులు తండ్రిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రిపైన, నమ్మించి మోసం చేసిన యువకుడిపైనా కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాయమాటలు చెప్పిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments