Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాలోకేష్ అజ్ఞాని, చెల్లని కాసు.. విజయసాయిరెడ్డి

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (12:06 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై అప్పుడప్పుడు సెటైర్లు పేలుతూనే వుంటాయి. అప్పుడప్పుడు నోరుజారి నెటిజన్లు, ట్రోలర్లకు చిక్కే నారా లోకేష్.. తాజాగా మరోసారి నెటిజన్లకు పని చెప్పారు. నారా లోకేష్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల ఘాటు పెంచింది. రోజుకోసారి అయినా నారా లోకేష్‌ను విమర్శిస్తూ వైకాపా సోషల్ మీడియాలో ఏకేస్తోంది. 
 
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తూ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎక్కసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని  నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లు సైనికులకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు. తన ట్విట్టర్ ‌ఖాతాలో చంద్రబాబు, నారా లోకేష్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments