పిల్లల నుంచి పెద్దల వరకు పానీ పూరీలంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం పూట స్నాక్స్‌గా పెద్దలు పానీపూరీని ప్లేట్లు ప్లేట్లు లాగిస్తుంటారు. పిల్లలు కూడా వాటిని ఇష్టపడి తింటుంటారు. అయితే వర్షాకాలం పానీపూరీలు అవీ రోడ్ల పక్కన అమ్మే పానీ పూరీలను అస్సలు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే.. పానీపూరీ కోసం వాడే నీటి విషయంలో అమ్మకపు దారులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పానీపూరీలో మంచినీటిని కాకుండా సాధారణ నీటిని వాడుతూ.. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పదార్థాలను తయారు చేసి వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆహార నాణ్యతను పరిశోధించే అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పానీపూరీ మిశ్రమాన్ని తయారు చేసే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను కనుక మీరు చూస్తే తప్పకుండా ఇంకోసారి రోడ్ల పక్కన అమ్మే పానీ పూరీ టేస్ట్ చేయరు.